ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం–వరంగల్ బైపాస్‌పై రోడ్డు ప్రమాదం.. టూవీలర్‌ వ్యక్తికి తీవ్ర గాయాలు



 

ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ఘటన

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో గల ఖమ్మం–వరంగల్ బైపాస్ రోడ్డుపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఫార్చునర్ కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు గాయపడిన వ్యక్తి రక్తస్రావంతో రహదారిపై పడిపోయినట్లు తెలిసింది. బాధితుడు ప్రాణాలతో ఉన్నప్పటికీ తీవ్ర గాయాల కారణంగా కోమా స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. అయితే, బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఫార్చునర్ కారు ఖమ్మం రూరల్ మండలంలోని ఆరంపుల గ్రామానికి చెందిన సాయి ఉమేష్ గ్రానైట్ సంస్థ నిర్వాహకుడికి సంబంధించిందని తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధితుడి వివరాలపై పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم