ఎల్‌నినో పై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ది సర్వోత్తమ రెడ్డిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో అత్యధిక ఆధిక్యతతో గెలిపించేందుకు కొత్త ఓటర్లను ఉద్యమ స్పూర్తితో నమోదు చేయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోరారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీలోని నాయుడుపేట జంక్షన్, టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటైన పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు మంచి విత్తనాలు నాటితే మంచి దిగుబడి వచ్చినట్లే శాసనమండలికి మంచి అభ్యర్దిని పంపితే మంచి ఫలితాలు ఉంటాయని గుర్తు చేశారు. ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గుర్తు చేస్తూ మరో ఎనిమిది రోజల వ్యవధిని గమనించి మీ కుటుంబం, గ్రామం, మిత్రవర్గంలోని గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వంలో లబ్దిపొందని వారు ఉండరని చెబుతూ అలాంటి వారిని గుర్తించి ఓటర్లుగా చేర్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇటీవల సర్ ఉద్యమం గొప్పగా నిర్వహించినట్లే ఇప్పడు ఈ ఓటర్ల చేర్పించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని , ఈ మూడు జిల్లాలు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉందని గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఉత్తమ అభ్యర్ది అయిన సర్వోత్తమ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. సర్ కార్యక్రమంలో తప్పులను బయటపెట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వాన్ని గద్దెదింపడం ఖాయమని మంత్రి పొంగులేటి జోస్యం చెప్పారు. ఢిల్లీలో జరిగే ధర్నాకు లక్షలాదిగా తరలిరావాలని ఆయన కోరారు.
ఎల్‌నినోపై ప్రతిపక్షాల దుష్ప్రచారం
ప్రపంచంలో వంద దేశాలకు పైగా ఎల్‌నినో ప్రభావంతో విపత్కర పరిస్దితులను ఎదుర్కొంటుండగా రాష్ట్రంలో బిఆర్ఎస్, బిజేపీలో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి గారు విమర్శించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రతిపక్షాలు చెప్పే అసత్యాలను నిర్భయంగా ఖండించాలని కోరారు. ప్రకృతి విపత్తులను సైతం రాజకీయ లబ్దికి వాడుకోవడానికి ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని ఉపేక్షించవద్దని, మౌనం వీడి నిర్భయంగా ప్రతి ఒక్కరు వాస్తవాలను ప్రజలకు తెలపాలన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్‌నినో పై ప్రజలను జాగృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత స్వర్ణకుమారి అధ్యక్షత వహించగా, అభ్యర్ధి రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి, ఖమ్మం డిసిసి అధ్యక్షులు సత్యనారాయణ, పార్టీ నేతలు నాగేశ్వరరావు, గోపాల్ రెడ్డి, ఏదులాపురం ఛైర్‌పర్సన్ అనిత, కృష్ణారెడ్డి, నరేష్‌రెడ్డి, గోపన్న, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి