తుంబూరు దయాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నాయకులు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బానోత్ సాయి సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డిని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యూత్ కాంగ్రెస్ నాయకులకు తుంబూరు దయాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. యువజన కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో యువతను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేయడంతోపాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు పొందిన నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా యువజన కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షుడు వెంపటి రవి, 30వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు కొట్టం రంజిత్ రెడ్డి, యర్ర శేఖర్ రెడ్డి, గంగారపు యాదగిరి, యువజన నాయకులు బోయిన సాయి, ఏపూరి తరుణ్, భద్రాచారి, శివ, వడ్లకొండ భుజంగరావు, సాయి కార్తీక్, ఏపూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق