ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వాడపల్లి బ్రహ్మోత్సవాల్లో ఖమ్మం భక్తుల ఆధ్యాత్మిక సందడి



 


ఏడు వారాల స్వామివారి సన్నిధిలో భక్తుల ప్రత్యేక పూజలు.. భక్తిశ్రద్ధలతో దివ్య దర్శనం


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్  : ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా వాడపల్లిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడు వారాల వేంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచిన స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన వరగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని భక్త బృందం శనివారం వాడపల్లి చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని, మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి ఖమ్మం ప్రాంతం నుంచి కూడా నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా దేవరపల్లి హైవే ప్రారంభం కావడంతో ఖమ్మం నుంచి వాడపల్లికి రాకపోకలు మరింత సులభతరమయ్యాయని, ప్రయాణ సమయం తగ్గడంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో నర్సింగ్ రంగారావు, కొంక సాయి స్వరూప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది