బ్యూరో ఏనుగు వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఖమ్మం జిల్లా సమావేశం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో గల ఐశ్వర్య కన్వెన్షన్ హాల్లో ప్రజాపక్షం ఖమ్మం జిల్లా విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఖమ్మం రూరల్ మండల రిపోర్టర్ బంక అశోక్ అధ్యక్షతన బ్యూరో ఏనుగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజాపక్షం దినపత్రిక బ్యూరో మాట్లాడుతూ... ప్రజాపక్షం దినపత్రిక ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా విశ్లేషణాత్మకమైన కథనాలు ప్రచురించాలని విలేఖరులకు సూచించారు. అలాగే ప్రజా సమస్యలపై తమదైన శైలిలో పదునైన కథనాలను అందివ్వాలన్నారు అలాగే 2027 కు సంబంధించిన క్యాలెండర్ పై రిపోర్టర్లతో సమాలోచన చేశారు. తొలుత ఖమ్మం నగర ఎడ్యుకేషన్ రిపోర్టర్ ఇంద్రసేనా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడివిటీ మేనేజర్ ప్రసన్న , స్టాపర్లు ప్రసాద్, కృష్ణార్జున మండల రిపోర్టర్లు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి