ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బోనకల్ గురుకుల పాఠశాలలో ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు!


 


తరగతి గదిలో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు.. ఒకరికి తలకు గాయం, మరొకరికి కాలికి గాయం


ప్రజాపక్షం/ బోనకల్: ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. తరగతి గదిలో స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. చాపలమడుగు పూజిత (14) తలకు గాయాలు కాగా, అద్దంకి కీర్తన కాలికి గాయమైంది. గాయపడిన విద్యార్థినులను చికిత్స నిమిత్తం బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు సమాచారం. అక్కడ వైద్య సిబ్బంది పూజితకు కుట్లు వేసి చికిత్స అందించినట్లు తెలిసింది. విద్యార్థినులు చదువుకుంటున్న తరగతి గదిలోనే స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో పాఠశాల భవనం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా గురుకుల పాఠశాల భవనంలోని అన్ని తరగతి గదులను అధికారులు పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم