ఖమ్మం, కొత్తగూడెం, కూసుమంచిలో రక్తదాన శిబిరాలు.. అన్నదాన కార్యక్రమాలు
ఉభయ జిల్లాల్లో సేవా కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణుల సన్నద్ధం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రెండు జిల్లాల పరిధిలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8:30 గంటలకు తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నారు. అదేవిధంగా కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మంత్రి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా జరుపుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

إرسال تعليق