ప్రజాపక్షం/కూసుమంచి: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పత్తి చేలోకి దూసుకెళ్లిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లింగారంతండా సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పత్తి చేలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పడానికి అతివేగమే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
జాతీయ రహదారిపై పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
byThe News Desk
-
0

إرسال تعليق