ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


 


నీటి సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు.. చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎల్‌నినో అవగాహన గ్రామసభకు హాజరైన ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడి నీటి సంరక్షణ, చిరుధాన్యాల సాగు ప్రాధాన్యతను వివరించారు.వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.



చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలి


మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వివరించారు. తక్కువ నీటితో సాగు చేసేందుకు అనువైన చిరుధాన్యాల పంటలపై అవగాహన పెంచుకోవాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా వ్యవసాయంలో ఎదురయ్యే నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చనే అంశాన్ని వివరించారు.


ప్రజల భాగస్వామ్యంతోనే నీటి సంరక్షణ


నీటి సంరక్షణ అనేది ఒక్క ప్రభుత్వ శాఖకే పరిమితమైన బాధ్యత కాదని, ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అవగాహన కల్పించారు. గృహావసరాలు, వ్యవసాయం తదితర రంగాల్లో నీటిని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరంపుల మరియమ్మ, తహసిల్దార్ వినయంధర్ రెడ్డి, ఎంపీడీవో రవికుమార్, ఐ బి డి రాజేష్, వ్యవసాయ శాఖ ఏవో ఉమా నాగేష్, గ్రామ సెక్రరెటరీ రవీందర్, టిఆర్ఎస్ నాయకుడు ముత్యం పెద్ద కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم