ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ముత్తగూడెం గ్రామానికి చెందిన గూదె నరసింహారావుకు డాక్టరేట్ లభించింది. మధిర లోని టివిఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చేసిన పరిశోధనకు గాను కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 18న జరిగిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ ను అందజేశారు. ప్రొఫెసర్ డాక్టర్ పి.రవికుమార్ మార్గదర్శకత్వంలో తన పరిశోధనలను పూర్తి చేసినట్లు నరసింహారావు తెలిపారు. డాక్టరేట్ సాధించడంతో ముత్తగూడెం గ్రామస్తులు, సహచరులు ఆయనను అభినందించారు.
ముత్తగూడెం వాసికి డాక్టరేట్
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి