ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మ రూరల్ మండలం రేషన్ డీలర్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సుధారాణి, వినోద్ కుమార్ లు ఎన్నిక


ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు అనుబంధంగా ఖమ్మం రూరల్ మండలం గ్రామీణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఆదివారం రూరల్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం రూరల్ మండలం గౌరవ అధ్యక్షులుగా ఎల్లంపల్లి యాదగిరి,అధ్యక్షులుగా గుడిసె సుధారాణి ,ప్రధాన కార్యదర్శిగా చెక్కల వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా కొమరబత్తిన బాలరాజు ,సహాయ కార్యదర్శిగా దండేల రవీందర్ ,కోశాధికారిగా శబాష్ కన్నా రెడ్డి, ప్రచార కార్యదర్శిగా లింగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బి దర్గయ్య ,ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జానీమియా, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎల్లంపల్లి యాదగిరిలు హాజరై మాట్లాడారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి నాయకోటి రాజు ఆధ్వర్యంలోని యూనియన్ ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో రేషన్ డీలర్ల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం ముందుకు నడుస్తుంది అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి రావలసిన కమిషన్ను సకాలంలో అందే విధంగా కృషి చేస్తామన్నారు. రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీల్ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ రేషన్ డీలర్ల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు మందటి వెంకటరమణ, నరసింహారావు, ఆంజనేయులు, లింగరాజు, సునీత తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది