ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఏదులాపురంలో ద్విచక్ర వాహనం కాల్చివేత


 


దోషులను కఠినంగా శిక్షించాలి : సిపిఐ(ఎం) పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ 


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఐద్వా మహిళా నాయకురాలు పోతనబోయిన నిర్మల కుమారుడు శ్రీరామ్ ద్విచక్ర వాహనాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు.శ్రీరామ్ ఖమ్మం నగరంలోని శివ ఆర్డోపెడిక్ సెంటర్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు.ఎప్పటిలాగానే సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చి ఇంటి ముందు తన ద్విచక్ర వాహనం ( స్కూటీ ) పార్క్ చేసి నిద్రపోయారు.సుమారు రాత్రి 11.30 సమయంలో ఇంటి ఎదురుగా ఉన్నవారు లేచి చూసే సమయానికి వాహనం తగలబడి పోతున్న విషయం గమనించి గట్టిగా కేకలు వేయడంతో బయటికి వచ్చి చూడగా పూర్తిగా దగ్ధమవుతున్న ద్విచక్ర వాహనాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విషయం వెంటనే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



 పోతనబోయిన నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి రమేష్ 


విషయం తెలుసుకున్న సిపిఐ(ఎం) పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మంగళవారం ఐద్వా నాయకురాలు నిర్మల గృహానికి వెళ్లి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో వేగం పెంచి ఏం జరిగిందో త్వరగా కనిపెట్టాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులు ఎంతటివారైనా శిక్షించాలని కోరారు.కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) ఏదులాపురం గ్రామ శాఖా కార్యదర్శి దుండిగాల నాగయ్య,మున్సిపాలిటీ కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి,జిల్లా నాయకులు నండ్ర ప్రసాద్,నందిగామ కృష్ణ, మండల కమిటీ సభ్యులు దుండిగాల వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ నాయకులు మామిండ్ల పవన్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, బల్లి ఉదయ్, దిగుట్ల బ్రహ్మం,పొన్నేకంటి అనీష్,ఏపూరి పెద్ద గోపి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది