ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా దుర్గమ్మ తల్లి వద్ద అన్నదానం




అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ బెల్లం ఉమా.. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో కొలువుదీరిన శ్రీ దుర్గమ్మ తల్లి సన్నిధిలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ నాయకుడు రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఖమ్మం రూరల్ మాజీ ఎంపీపీ బెల్లం ఉమా ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్యా నాయక్ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, బెల్లం ఉమాను శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم