ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

బాల భారతి విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


 


2005–2006 పదో తరగతి బ్యాచ్‌ సందడి.. గురువులకు ఘన సన్మానం


ప్రజాపక్షం /తల్లాడ: స్థానిక బాల భారతి విద్యాలయంలో 2005–2006 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న రోజుల్లో ఎదురైన అనుభవాలు, ఉపాధ్యాయులు అందించిన మార్గదర్శకత్వం, స్నేహితులతో పంచుకున్న అనుభూతులను గుర్తుచేసుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత తాము ఎంచుకున్న వృత్తులు, ప్రస్తుతం స్థిరపడిన రంగాలు, జీవితంలో సాధించిన విజయాలను ఒకరికొకరు వివరించుకున్నారు. సంవత్సరాలు గడిచినా తమ మధ్య స్నేహబంధం చెక్కుచెదరకపోవడంతో ఈ సమ్మేళనం ప్రత్యేకంగా నిలిచింది.తమకు విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణతో కూడిన జీవితానికి పునాదులు వేసి, ఉన్నత స్థాయికి ఎదగడానికి మార్గనిర్దేశం చేసిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువుల పట్ల తమకున్న గౌరవం, అభిమానాన్ని చాటుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కూడా పూర్వ విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో KSM విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్, డైరెక్టర్ కె. శ్రావణి, రాధా మేడం, పూర్వ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, 2005–2006 పదో తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, గురువుల పట్ల గౌరవాన్ని చాటుతూ, స్నేహబంధాలను మరింత బలోపేతం చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న వారందరికీ మధురానుభూతిని మిగిల్చింది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم