ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు


 


వేడుకల్లో పాల్గొన్న కేజీ సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు


ప్రజాపక్షం/వైరా: వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలోని విజ్ఞాన్ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు తంగేడు తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. ఉపాధ్యాయులు సైతం వయసును పక్కనపెట్టి విద్యార్థులతో కలిసి ఆటపాటల్లో పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలను పాఠశాలల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలియజేయడంతో పాటు వాటిని భావితరాలకు అందించవచ్చని తెలిపారు. తెలంగాణ పండుగల గొప్పదనాన్ని తెలుసుకొని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్, కేజీ సిరిపురం గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది