ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వృద్ధుల అనుభవం సమాజానికి మార్గదర్శకం


 

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ఐకేపీ కార్యాలయంలో ఘనంగా సన్మానం

ప్రజాపక్షం /నేలకొండపల్లి: వృద్ధుల అనుభవాలు, జీవిత పాఠాలు భావితరాలకు మార్గదర్శకమని, వారిని గౌరవించి అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీఎం కట్టా సురేందర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో వృద్ధులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీఎం సురేందర్‌బాబు మాట్లాడారు... వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు ఆప్యాయత, గౌరవభావంతో మెలగాలని సూచించారు. సమాజ నిర్మాణంలో వృద్ధుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి అనుభవాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీలు పెద్దపాక వెంకటేశ్వరరావు, అచ్యుత,  గ్రామ దీపికల సంఘం ప్రతినిధి రాజాపుత్ర పార్వతిబాయితో పాటు మహిళలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది