మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో గాంధీజీకి ఘన నివాళులు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: గాంధీ ఆశయ బాటలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తుమ్మూరు దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతిని ఘనంగా నివాళులర్పించారు. తొలుత అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటానికి దయాకర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సామాజిక న్యాయం, సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలే ప్రజా పాలనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆ ఆశయాల బాటలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ రజాక్, మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్, నాయకులు కోసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి