ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ముత్యాలగూడెం కాటమయ్య గుడి వద్ద విద్యుత్ వెలుగులు!



 

మంత్రి పొంగులేటి చొరవతో సత్వరమే పనులు పూర్తి


విద్యుత్ అధికారులకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు


ప్రజాపక్షం/కూసుమంచి: అయ్యప్ప భక్తుల పూజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గురువారం నాడు ముత్యాలగూడెం గ్రామంలోని కాటమయ్య గుడి వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు పనులను సత్వరమే పూర్తి చేసిన విద్యుత్ అధికారులను గ్రామ ప్రజలు అభినందించారు. గుడి వద్ద విద్యుత్ సదుపాయం లేకపోవడంతో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. గుడి వద్ద విద్యుత్ సదుపాయం కల్పించేందుకు సుమారు అర కిలోమీటరు మేర విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, వైర్లు లాగి వీధిదీపాలను అమర్చారు. భక్తులకు అవసరమైన సదుపాయాన్ని కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు వేగంగా స్పందించి పనులను పూర్తి చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


మంత్రి పీఏ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి చొరవ


మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు, చొరవతో పాటు మంత్రి పీఏ తంబూరి దయాకర్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో విద్యుత్ పనులు వేగంగా పూర్తయ్యాయని గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం వల్లే ఈ సదుపాయం త్వరగా అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.


విద్యుత్ అధికారులకు అభినందనలు


కాటమయ్య గుడి వద్ద విద్యుత్ సదుపాయం కల్పించడంలో చొరవ చూపి, పనులను సత్వరమే పూర్తి చేసిన ఏడీఈ వెంకట్, ఏఈ మహమ్మద్ అక్బరుద్దీన్, జేఎల్ఎం ఎం. శ్యామ్‌లను కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు మంకెన శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పేరెల్లి అశోక్, ఉపసర్పంచ్ పాసిని ప్రభాకర్, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సదుపాయం కల్పించడం అభినందనీయమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే సత్వర ఫలితాలు సాధ్యమవుతాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది