ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు


 

ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే డా. బి. చంద్రావతి


ప్రజాపక్షం/ఖమ్మం: ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైద్యురాలు డా. బి. చంద్రావతి స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ, న్యాయమైన వేతనాలు సహా పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ఆహ్వానం మేరకు శనివారం ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఆమె, ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డా. చంద్రావతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్యోగులే తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టాల్సి రావడం బాధాకరమన్నారు. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ముందుగా అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. వైద్యురాలిగా ఆరోగ్య సిబ్బంది సేవల ప్రాధాన్యత, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని పేర్కొన్న ఆమె, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని డా. బి. చంద్రావతి భరోసా ఇచ్చారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم