ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నా భూమిలో నుంచి ఆవులు తోలొద్దంటూ హుకుం.. రైతుపై కర్రతో దాడి!


 

అడ్డుకున్న భార్యపైనా దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: తన భూమి నుంచి ఆవులను తోలుకొని వెళ్లొద్దంటూ ఓ భూ యజమాని రైతుపై కర్రతో దాడి చేసి గాయపరిచిన ఘటన ఎదులాపురం మున్సిపాలిటీలో బుధవారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురానికి చెందిన రైతు మామిళ్ల నరేందర్ రెడ్డి తన రెండు ఆవులను బోడుకు తోలుకొని వెళ్తుండగా, మామిళ్ల నర్సిరెడ్డి అనే భూ యజమాని అడ్డుకున్నాడు. తన పొలం నుంచి ఆవులను తోలుకొని వెళ్లొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నర్సిరెడ్డి పరుష పదజాలంతో దూషిస్తూ కర్రతో నరేందర్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో నరేందర్ రెడ్డి తలకు గాయమైంది.భర్తపై దాడి చేయడాన్ని ప్రశ్నించిన నరేందర్ రెడ్డి భార్యను సైతం నిందితుడు కర్రతో భుజంపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మామిళ్ల అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముస్కరాజు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది