ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మంత్రి పొంగులేటి ఆశయంతో... ఎదులా"పుర"o అభివృద్ధికి పెద్దపీట.



 


మంత్రి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి.


వరంగల్‌ బైపాస్‌ రోడ్డులో ఈ-స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన.


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్‌: రాష్ట్రంలోనే ఏదులాపురం మున్సిపాలిటీని అగ్రగామిగా తీర్చిదిద్దాలనే  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్‌ బైపాస్‌ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న ఈ-స్టేషన్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఈ-స్టేషన్‌ నిర్వాహకులు కనకమేడల గోపాలకృష్ణ,జక్కంపూడి రాము, కౌన్సిలర్లు వెంపటి ఉమా వెంకన్న, బానోత్‌ దివ్య, కాంగ్రెస్‌ నాయకులు గణపారపు వీరన్న, వెంపటి సురేష్‌, రామిశెట్టి రమేష్‌, వెంపటి రవి, మోహన్ రెడ్డి , చీకటి శ్రీను, తరుణ్‌,  భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది