ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రోడ్డు పనులపై ముష్టికుంట్ల రైతుల అభ్యంతరం!


 


 రూ.5.50 కోట్ల అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోతామంటూ ఆందోళన 


ఇరువైపులా సమానంగా పనులు చేపట్టాలి


 ఏఐకేఎస్ మండల అధ్యక్షులు కొంగర భాస్కరరావు 


ప్రజాపక్షం/బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల–గార్లపాడు రహదారి అభివృద్ధి పనులపై ముష్టికుంట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహదారిని ఇరువైపులా సమానంగా విస్తరించాల్సి ఉండగా, ఒకవైపు ఉన్న తమ వ్యవసాయ భూములను రోడ్డు నిర్మాణంలో కలిపేస్తున్నారని ఆరోపిస్తూ పనులను అడ్డుకున్నారు. ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.5.50 కోట్ల నిధులు కేటాయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన జరిగింది. రహదారి పూర్తయితే రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. ఈ సందర్భంగా ఏఐకేఎస్ మండల అధ్యక్షులు కొంగర భాస్కరరావు రైతుల అభ్యంతరాలను ప్రస్తావిస్తూ, రహదారి విస్తరణలో రైతులకు నష్టం కలగకుండా ఇరువైపులా సమానంగా పనులు చేపట్టాలని కోరారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది