ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎదులాపురం మున్సిపాలిటీలో చికెన్, మటన్, చేపల వ్యర్థాల సేకరణకు బహిరంగ వేలం


 

ఎదులాపురం: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చికెన్, మటన్, చేపల వ్యర్థాల సేకరణ, రవాణా కాంట్రాక్టు నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ. శ్రీనివాస రెడ్డి తెలిపారు.


ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎదులాపురం మున్సిపల్ కార్యాలయంలో వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.1,50,000 డిపాజిట్‌తో పాటు రూ.10,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


వేలం ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని కమిషనర్ కోరారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم