ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పదవిలో ఉన్నా.. పంథా మారని కమ్యూనిస్టు నేత



 

కురుస్తున్న వానలోనే పంట పొలాల్లోకి కూనంనేని.. రైతులతో మమేకం

హంగులు, ఆర్భాటాలకు దూరంగా ప్రజాక్షేత్రంలో సీపీఐ ఎమ్మెల్యే పర్యటన

ప్రజాపక్షం/ కొనిజర్ల: ప్రజా సమస్యలే ఎజెండాగా, ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతమని మరోసారి చాటిచెప్పారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. హంగులు, ఆర్భాటాలకు తావులేకుండా, కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి రైతుల పరిస్థితులను తెలుసుకోవడం కమ్యూనిస్టు నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఏర్పడిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మంగళవారం కొణిజర్ల మండలంలో కూనంనేని పర్యటించారు. కొణిజర్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను వర్షంలోనే పరిశీలించి, పంటల ప్రస్తుత స్థితిగతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటలకు ఎదురవుతున్న ఇబ్బందులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల పర్యటనలంటే అధికారుల హడావుడి, స్వాగత ఏర్పాట్లు, హంగులు కనిపించే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. పదవులు, హోదాల కంటే ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడమే కమ్యూనిస్టు ఉద్యమం నేర్పిన రాజకీయ సంస్కారమనే విషయాన్ని కూనంనేని తన పర్యటన ద్వారా చాటిచెప్పారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఓ కామ్రేడ్ చేతిలో నుంచి ఎగిరిన ఎర్ర జెండా సైతం నిబద్ధతకు చిహ్నంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు, కొణిజర్ల మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

1 تعليقات

إرسال تعليق

Post a Comment

أحدث أقدم