మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి
ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరడమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన లక్ష్యమని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క అర్హుడూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గుర్రాలపాడులో నూతన డిజిటల్ (స్మార్ట్) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ బుర్ర మహేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ...పేద, నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులకు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను వారి వద్దకే తీసుకెళ్లాలన్నదే మంత్రి పొంగులేటి ఆలోచన అని తెలిపారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. చిన్నారుల విద్యాభివృద్ధి, పోషణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బానోత్ ప్రసాద్, బానోత్ దివ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోర్నే సీతారాములు, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్లపూడి భద్రకాళి, 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల రామ్మోహన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది జ్యోతి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి