ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి


 


పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

– మై ఛాయిసెస్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి అహరోన్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకొచ్చి భాగస్వాములు కావాలని మై ఛాయిసెస్ ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి అహరోన్ పిలుపునిచ్చారు. స్కోప్ ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షిత గ్రామ కార్యక్రమంలో భాగంగా ఎదులాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ పోలీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లాలో స్కోప్ ఆర్డీ ద్వారా సురక్షిత గ్రామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, పిల్లలు, మహిళలను వివిధ రకాల దోపిడీకి గురిచేసే ఉద్దేశంతో మోసం, బలవంతం వంటి మార్గాల్లో వ్యక్తులను నియమించడం, తరలించడం జరుగుతుందని వివరించారు. అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు, బాలికలు అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలని సూచించారు. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే 18004198588 లేదా చైల్డ్‌లైన్ 1098కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగుల్ మీరా మాట్లాడుతూ బాలల అక్రమ రవాణా నిరోధానికి తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, అసురక్షిత వలసలు, గృహహింస వంటి అంశాలు కూడా అక్రమ రవాణాకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపరిచితులు ఇచ్చే వస్తువులు, పదార్థాలను పిల్లలు తీసుకోవద్దని హెచ్చరించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పరిమితం చేసి చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు లక్ష్మయ్య మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలబాలికల హక్కులు, సంక్షేమ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ, మై ఛాయిసెస్ ఫౌండేషన్, స్కోప్ ఆర్డీ సంస్థల సేవలను అభినందించారు.అనంతరం విద్యార్థినీ విద్యార్థులు మానవ అక్రమ రవాణా నిర్మూలనపై నాటిక ప్రదర్శించి అవగాహన కల్పించారు. బాలబాలికలకు ఈ అంశంపై రూపొందించిన కామిక్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్కోప్ ఆర్డీ కోఆర్డినేటర్ కె. సుజాత, సీడబ్ల్యూసీ సభ్యుడు లక్ష్మయ్య, షీ టీం కానిస్టేబుల్ కిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కరరావు, అంగన్‌వాడీ టీచర్ దుర్గ, ఆశా వర్కర్ జానమ్మ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది