రోగులకి పండ్లు బ్రెడ్ పంపిణీ
ప్రజాపక్షం/ వైరా: నిధి ఇట్ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్ గరిదేపల్లి సాయికిరణ్ ఆధ్వర్యం ఘనంగా రామోజీ ఉప్పల చారి జన్మదిన వేడుకలను గొల్లపూడి వృద్ధాశ్రమం లో నిర్వహించారు. అనంతరం వైరా గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులతోకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా వంటకాలను వడ్డిస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల చారి మాట్లాడుతూ.. పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధుల సంక్షేమం, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు చేయూత అందించాలని కోరారు. మనం అందించే చిన్న సహాయం సైతం వారికి ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వృద్ధులను ప్రేమతో, ఆప్యాయతతో ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమo లో చింతపల్లి వినోద్,మోడ్రు సురేష్,మొండ్రు బాలరాజు,వేముల శ్రీనాథ్ ,మురళీ ,దేవాళ్ళ సాయి,రాచకొండ సాయి,నిఖిల్ ,బత్తుల సాయి,ఆసిఫ్ ,చింతపల్లి మానికుమార్, అడ్డు తదితరులు పాల్గొన్నారు


إرسال تعليق