– జిల్లా కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న అవేర్ హాస్పిటల్లో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం సురేష్ నాయక్ మాట్లాడుతూ, “నిండు జీవితానికి రెండు చుక్కలు” అనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో నిర్మూలనలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన ఆయన, వారి సేవలు అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు సమీపంలోని పోలియో కేంద్రాలకు పిల్లలను తీసుకువెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

إرسال تعليق