జలగం నగర్ అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం
పాల్గొన్న 4వ వార్డు కౌన్సిలర్ బోయిన కుమారి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని 4వ వార్డు కౌన్సిలర్ బోయిన కుమారి పిలుపునిచ్చారు. ఆదివారం జలగం నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బోయిన కుమారి మాట్లాడుతూ, దేశం పోలియో రహిత హోదా సాధించినప్పటికీ ఆ విజయాన్ని శాశ్వతంగా కొనసాగించాలంటే ప్రతి పల్స్ పోలియో రౌండ్లో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది, ప్రజలందరిపై ఉందన్నారు.ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం టీకాలు ఎంతో అవసరమని తెలిపారు. కేంద్రానికి రాని చిన్నారులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోయిన సాయి, ఏఎన్ఎం సంగమ్మ, ఆశా కార్యకర్తలు నాగమణి, మమత చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే అంగన్వాడీ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

إرسال تعليق