ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గత నాలుగు రోజులుగా పనిచేయని స్టాంప్ విక్రయ సైట్.. ఇబ్బందుల్లో ప్రజలు


 


ఖమ్మం/ప్రజాపక్షం, జూన్ 29: గత నాలుగు రోజులుగా స్టాంప్ విక్రయానికి సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు, స్టాంప్ విక్రేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ సమస్యల కారణంగా ఈ-స్టాంపుల జారీ పూర్తిగా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్‌లు, అఫిడవిట్‌లు, ఒప్పంద పత్రాలు తదితర అత్యవసర పనులు వాయిదా పడుతున్నాయి.స్టాంప్ కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా పని జరగక నిరాశతో వెనుదిరుగుతున్నారు. స్టాంప్ విక్రేతలు కూడా వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో తమ వ్యాపారాన్ని నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ లావాదేవీలపై కూడా దీని ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, వెబ్‌సైట్‌ను సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, స్టాంప్ విక్రేతలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم