ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నీ స్థాయికి మేమే ఎక్కువ... మంత్రి పొంగులేటి పై విమర్శలు మానుకో



 

సిపిఎం టిడిపి పిఆర్పి ఇప్పుడు టిఆర్ఎస్ అంటూ పార్టీలు మారింది నువ్వు

పిండిప్రోలు లో వార్డు మెంబర్ కి గెలవలేని నీకు మాట్లాడే నైతికత ఉందా?

కెసిఆర్ కాళ్లు పట్టుకుని నువ్వు పదవులు తెచ్చుకున్న సంగతి మాకు తెలుసు

విలేకరుల సమావేశంలో బేబీ మద్దినేని స్వర్ణకుమారి


ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : నీ సొంత ఊరు పిండి ప్రోలు గ్రామంలో వార్డ్ మెంబర్ గా గెలవలేని నువ్వు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సవాలు చేసే స్థాయి నీది కాదని రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రటరీ బేబీ మద్దినేని స్వర్ణకుమారి అన్నారు. సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధి,22వ వార్డులోని సాయి గణేష్ నగర్లో  గల  చైర్ పర్సన్  కార్యాలయంలో  మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాతా మధు పై విరుచుకుపడ్డారు. అమెరికాలో కప్పులు కడిగిన నీ చరిత్ర ఏమిటో మరిచిపోయావంటూ వ్యంగ్యంగా స్పందించారు. అలాగే నీకు రాజకీయ ఓనమాలు నేర్పిన సిపిఎం పార్టీకి వెన్నుపోటు పొడిచి టిడిపి, పిఆర్పి, ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరి పార్టీలు మార్చిన చరిత్ర నీది అన్నారు. పార్టీల ఫిరాయింపులకు పాల్పడి కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి , సత్తుపల్లి అశ్వరావుపేట తో పాటు పలువురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల కొనుక్కుంది మీరు కాదా అన్నారు. ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు దాటనివ్వనని శబదం చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని మరో మారు కూడా మీకు వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులకు ఏం చేశామని కాదు ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నామని ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీరు ఒరేస్తే ఊరే  అంటూ మాట్లాడితే మేము నేడు వ్యవసాయాన్ని పండుగ చేశామన్నారు. ఈ సభ ద్వారా రైతులకు రైతుబంధు విడుదల చేయడంతో పాటు చేపట్టునున్న మరిన్ని సంక్షేమ పథకాలను వివరించబోతున్నట్లు తెలిపారు. అంతేకానీ మీకులా చేయని పనులు ఊదరగట్టుకోవడం, మీ హంగు ఆర్భాటం చూపించడానికి పెట్టేలాంటి సభ కాదు అన్నారు. మీ అక్కసు చూస్తుంటే స్పష్టంగా అవగతం అవుతుందని పొంగులేటి చేస్తున్న అభివృద్ధి ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అనేది అర్థమైంది అన్నారు. నీ స్థాయికి మేమే ఎక్కువ అని సవాల్ విసురుతున్నామని మీ 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారు రెండున్నర సంవత్సరంలో రైతులకు కాంగ్రెస్ ఏం చేసిందో వివరించేందుకు ఎక్కడికి రమ్మంటావో చెప్పాలని అన్నారు. మరోసారి మంత్రి పొంగులేటి పై అవాకులు చవాకులు పేలితే పాలేరు నియోజకవర్గంలో మా కార్యకర్తలు తిరగనీయరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పోకబత్తిని అనిత , వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్, ఖమ్మం రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది మల్లారెడ్డి, సర్పంచ్ పాప నాయక్ , కౌన్సిలర్లు దివ్య, నవీన్, రవి,  ప్రసాద్,  కాంగ్రెస్ నాయకులు వెంపటి రవి, రంజిత్ నాయక్, గునిగంటి సురేష్, బోయిన సాయి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم