ప్రజాపక్షం /ఖమ్మం రూరల్ : మండలంలోని తల్లంపాడు గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు డాక్టర్ బత్తినేని వెంకటేశ్వరరావును మంగళవారం పాలేరు మాజీ శాసనసభ్యులు కందళా ఉపేందర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా బత్తినేని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చర్చించారు. ఈ సందర్భంగా సీపీఎంతో తనకున్న అనుబంధాన్ని కందళా గుర్తు చేసుకున్నారు.బత్తినేని లాంటి మృదుస్వభావి,చమత్కారి అరుదుగా ఉంటారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు గోపాల్,నాయకులు రెంటాల ఆనంద్,గుడిబోయిన దర్గయ్య,శంకర్ రాజు,లెనిన్,రవి,నవీన్,ఉపేందర్,నరేందర్,జొన్నలగడ్డ శ్రీధర్,మట్టా వెంకటేశ్వరరావు,జర్పుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం సీనియర్ నాయకులు బత్తినేనిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందళా...
byThe News Desk
-
0

إرسال تعليق