ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాపస్ కాంతితో పత్తి రైతులకు ఊరట...


 


పొన్నేకల్ రైతు వేదికలో సబ్సిడీ విత్తనాలు పంపిణీ


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ (NFSNM) 2026–27 పథకం కింద ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ రైతు వేదికలో ‘కాపస్ కాంతి’ (అధిక పత్తి ఉత్పాదకత పథకం) కింద పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్హులైన రైతులకు సబ్సిడీపై పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు అధిక సాంద్రత విధానం (HDP) ద్వారా పత్తి సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని అధికారులుసూచించారు.శాస్త్రీయ సాగు పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఎత్తు, పరిమిత శాఖలతో పెరిగే ప్రత్యేక హైబ్రిడ్ విత్తనాలను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.అలాగే మొక్కల శాఖీయ పెరుగుదలను సరైన సమయంలో నియంత్రించడం, అధిక సాంద్రతతో సాగు చేయడం వల్ల సాధారణ సాగుతో పోలిస్తే 2–3 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉందని అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో పొన్నెకల్ సర్పంచ్ శ్రీ కోటి శ్రీనివాసరావు, కుసుమంచి సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) శ్రీ ఎం. సతీష్, ఎఫ్‌టీసీ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి బి. వాణి, ఎఫ్‌టీసీ వ్యవసాయ అధికారి శ్రీ శరత్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి అపర్ణ, ఎంపీడీఓ శ్రీ కె. రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీ తిలక్ కిషోర్, ఖమ్మం రూరల్ మండల వ్యవసాయ అధికారి (MAO), గుర్రాలపాడు, తల్లంపాడు వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم