ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై కారు దగ్ధం

స్వల్ప గాయాలతో ఏడుగురు యువకులు సురక్షితం

ప్రజాపక్షం / సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ ఎక్సిట్ పాయింట్ సమీపంలో జాతీయ రహదారిపై కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్  నుంచి ఎర్రవరం వైపు కారులో వెళ్తున్న సమయంలో ఫ్రంట్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి రహదారి రైలింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం వాహనానికి మంటలు వ్యాపించాయి.సమయస్ఫూర్తితో స్పందించిన యువకులు వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم