ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గ్రీన్ ఫీల్డ్ హైవే పై ప్రయాణం సురక్షితమైనదేనా..?


 

- గ్రీన్ ఫీల్డ్ హైవే డిజైన్ లోపమా....?
- అతివేగమే ప్రమాదాలకు కారణమా....?
- మలుపులు, ఎత్తుపల్లాలే ప్రమాదాలకి మూలమా....?
- ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వరుస ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోతున్న కొందరు,గాయలపాలవుతున్న మరికొందరు ప్రయాణికులు.. 
- భయాందోళనలో వాహనదారులు
- తప్పెవరిది..?

ప్రజాపక్షం / సత్తుపల్లి : అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించామని అధికారులు చెబుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు.
దీంతో హైవే నిజంగా సురక్షితమేనా...?అనే ప్రశ్న ఇప్పుడు ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది.
ప్రయాణికులు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం హైవేపై కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక మలుపులు, ఎత్తుపల్లాలు, వేగాన్ని నియంత్రించే హెచ్చరిక బోర్డుల కొరత వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొత్తగా ప్రయాణించే వాహనదారులు రహదారి స్వభావాన్ని అంచనా వేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.
అయితే మరోవైపు రహదారి నిపుణులు, ట్రాఫిక్ అధికారులు మాత్రం ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేనని అంటున్నారు. విశాలమైన, నిటారుగా కనిపించే రహదారిపై వాహనదారులు నిర్దేశిత వేగ పరిమితిని మించి ప్రయాణించడం వల్ల వాహనాలపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
స్థానిక ప్రజలు మాత్రం హైవేలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సాంకేతిక పరిశీలన చేపట్టాలని కోరుతున్నారు. అవసరమైతే అదనపు హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, ప్రతిబింబించే మార్కింగ్‌లు, స్పీడ్ మానిటరింగ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
హైవే నిర్మాణంలో డిజైన్ లోపాలున్నాయా...? లేక వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగమే ప్రధాన కారణమా.....? అనే అంశాలపై సంబంధిత అధికారులు, స్వతంత్ర సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని వాహనదారులు కోరుతున్నారు.ప్రాణనష్టం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ప్రమాదాల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టడమే వాహనదారులు ప్రాణాలను కాపాడే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم