ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం బైపాస్ రోడ్డులోసత్యనారాయణపురంలో ఉన్న కేజీబీవీలో ఖాళీగా ఉన్న మహిళా పీఈటీ పోస్టుకు తాత్కాలిక పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ ఆయేషా ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు బీపీఈడి (B.P.Ed), పీఈటీతో పాటు సంబంధిత విద్యా అర్హత పత్రాలను సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 27వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అభ్యర్థులు ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, సంబంధిత అర్హత పత్రాల ప్రతులను జత చేసి, తెల్ల కాగితంపై తమ అభ్యర్థిత్వ వివరాలు రాసి కేజీబీవీ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.అలాగే, అభ్యర్థుల వయస్సు 44 సంవత్సరాల లోపు ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే కేజీబీవీ పరిసర ప్రాంతాలకు చెందిన స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
కేజీబీవీలో మహిళా పీఈటీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
byThe News Desk
-
2

Sports management
రిప్లయితొలగించండిYes
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి