ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి


 

ప్రజాపక్షం/చింతకాని: చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీ మంగళవారం నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ కార్యక్రమ ఏర్పాట్లను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానుండడంతో సభ ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను మంత్రి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పోలీసు కమిషనర్ సునీల్ దత్‌తో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم