![]() |
| చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ |
ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి
పిలుపునిచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : చిన్నారుల నిండు జీవితానికి సంజీవిని లాంటి రెండు చుక్కలను ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వేయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా 31వ వార్డులోని సబ్ సెంటర్లో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడుతూ...దేశం పోలియో నిర్మూలనలో గొప్ప విజయాన్ని సాధించినప్పటికీ అప్రమత్తతను కొనసాగించడం అవసరమన్నారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు తీసుకోకుండా మిగిలిపోకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.గ్రామంలోని ప్రతి ఇంటికి అవగాహన కల్పించి అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యమే కుటుంబానికి, సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏవో శ్రీధర్ రెడ్డి, 32 వ వార్డు సిపిఐ కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, ఎదులాపురం మున్సిపాలిటీ సిపిఎం కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, ఏఎన్ఎం అనురాధ, ఆశాలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

إرسال تعليق