ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రూ.2 కోట్ల బ్లాక్‌మనీ పేరుతో మోసం.. నకిలీ పోలీసుల డెకాయిటీ ముఠా గుట్టురట్టు


 

TGSP కానిస్టేబుల్, ఆర్‌ఎస్‌ఐ సహా 12 మంది అరెస్ట్ 

రూ.17.60 లక్షల నగదు, వాహనాలు, పోలీసు యూనిఫాంలు స్వాధీనం

ప్రజాపక్షం / సత్తుపల్లి: రూ.2 కోట్ల బ్లాక్‌మనీని వైట్‌మనీగా మారుస్తామని నమ్మించి అమాయకులను వలలో వేసి, అనంతరం నకిలీ పోలీసుల వేషంలో బెదిరించి నగదు దోచుకునే అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠాను సత్తుపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు TGSP సిబ్బంది సహా మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.17.60 లక్షల నగదు, మూడు వాహనాలు, పోలీసు యూనిఫాంలు, డమ్మీ కరెన్సీ కట్టలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.281/2026గా కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ టి. శ్రీహరి ఆధ్వర్యంలో, కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. విశ్వసనీయ సమాచారం మేరకు గంగారం ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఠా సభ్యులు ముందుగా అమాయకులకు ఫోన్ చేసి తమ వద్ద రూ.2 కోట్ల బ్లాక్‌మనీ ఉందని, దానిని వైట్‌మనీగా మార్చేందుకు సహకరిస్తే పెట్టుబడికి నాలుగు రెట్లు డబ్బు ఇస్తామని ఆశ చూపేవారు. బాధితులు నగదుతో వచ్చిన అనంతరం డమ్మీ కరెన్సీతో నిండిన బ్యాగులను చూపించి, అదే సమయంలో నకిలీ పోలీసుల వేషంలో అక్కడికి చేరుకుని దొంగనోట్లు లేదా నేరానికి సంబంధించిన డబ్బు అంటూ బెదిరించి బాధితుల నగదును దోచుకుని పరారయ్యేవారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు TGSP 15వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ముళ్లగిరి వర్ధన్, ఆర్‌ఎస్‌ఐ బేరా కేశవరావు ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతుండగా, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని గురువారం విలేకరుల సమావేశంలో పోలీసులు తెలిపారు.


స్వాధీనం చేసుకున్న వస్తువులు


రూ.17.60 లక్షల నగదు

2,ఇన్నోవా కార్లు

1,ఎర్టిగా కారు

1 , టీవీఎస్ యాక్సెస్ స్కూటీ

16, సెల్‌ఫోన్లు

2,పోలీసు యూనిఫాంలు

1,ఎస్‌ఐ యూనిఫాం సెట్

1,ఆర్‌ఎస్‌ఐ యూనిఫాం సెట్

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم