ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా ప్రారంభమైన ఎదులాపురం మున్సిపాలిటీ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్



 తొలి రోజే 10 వార్డుల్లో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాలు

 పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం తొలి రోజే మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డుల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, ఓపెన్ ప్లాట్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, మురుగు నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం వంటి కార్యక్రమాలను మున్సిపల్ సిబ్బంది చేపట్టారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత తన 23వ వార్డులో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించి, అనంతరం పలు వార్డులను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల్లో నాణ్యతను పాటించాలని అధికారులకు సూచనలు చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగిస్తూ ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ విజయవంతం కావడానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు బుర్ర మహేష్, బానోతు ప్రసాద్, భానోత్ దివ్య, కడవ నవీన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم