ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

28వ వార్డుకు 'దండి'గా నీటి వరం..!


కౌన్సిలర్ చొరవతో ప్రారంభమైన మంచినీటి పైప్‌లైన్ పనులు

300 మీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు.. ప్రజల్లో హర్షం

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు మరో కీలక హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. వార్డులో చాలాకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను గుర్తించి, మున్సిపల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ పైప్‌లైన్ ఏర్పాటుకు చొరవ తీసుకోవడంతో శుక్రవారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాబాద్ నగర్ ఆర్చి వద్ద కౌన్సిలర్ దండి రంగారావు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్చి నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు సుమారు 300 మీటర్ల మేర కొత్త మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయిఈ సందర్భంగా కౌన్సిలర్ దండి రంగారావు మాట్లాడుతూ... ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం నా బాధ్యత అన్నారు. వార్డులో ఎక్కడ నీటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. మిషన్ భగీరథ నీరు అందని ప్రాంతాలకు కూడా పైప్‌లైన్ విస్తరణ కోసం కృషి చేస్తాను అని తెలిపారు.కౌన్సిలర్ చొరవతో ఎట్టకేలకు పైప్‌లైన్ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచినీటి సౌకర్యానికి నిధులు మంజూరు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏర్పాటుకు సహకరించిన కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డికి కౌన్సిలర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలపై స్పందిస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్న దండి రంగారావును పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకుడు శాబాద్ చిన్న సైదిరెడ్డి, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم