ప్రజాపక్షం/మధిర: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మధిర (ఖాజీపురం)లో వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి జూలై 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.2026 లేదా అంతకుముందు పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్ కౌన్సెలింగ్కు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలతో జూలై 4న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మధిర (ఖాజీపురం)లో హాజరై ప్రవేశాలు పొందాలని సూచించారు.ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9010222181, 9848958830 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

إرسال تعليق