ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరా రిజర్వాయర్‌కు 550 క్యూసెక్కుల గోదావరి జలాల విడుదల


 సాగర్ కాలువ ఎస్కేప్ లాకులు ఎత్తి నీటి ప్రవాహానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

 రెండుపంటలకు సాగునీరు అందుతుంది

ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

ప్రజాపక్షం / వైరా:ఏన్కూరు మండలం తిమ్మరావుపేట గ్రామ సమీపంలోని సాగర్ కాలువ ఎస్కేప్ లాకులను ఎత్తి వైరా రిజర్వాయర్‌కు 550 క్యూసెక్కుల గోదావరి జలాలను ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు హారతి ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, వైరా నియోజకవర్గ రైతులకు ప్రతి ఏడాది సాగునీటి సమస్య తలెత్తుతుండటంతో, సకాలంలో నీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్ల వ్యయంతో సీతారామ ప్రాజెక్టు పరిధిలో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు.

గోదావరి జలాలను సాగర్ కాలువలోకి తరలించి, అక్కడి నుంచి అనుసంధాన వాగుల ద్వారా వైరా రిజర్వాయర్‌కు చేరవేస్తున్నట్లు తెలిపారు. దీంతో వైరా ఆయకట్టు రైతులకు సమృద్ధిగా సాగునీరు అందడంతో రెండుపంటలు సాగు చేసే అవకాశం కలుగుతుందని, భవిష్యత్తులో సాగునీటి కొరత సమస్య ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గోదావరి జలాల తరలింపుతో వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.

గోదావరి జలాల విడుదల సందర్భంగా పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మాజీ మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారావు, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, తాటిపూడి సర్పంచ్ జవాజి అశ్విని, శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు, పమ్మి అశోక్, పణితి సైదులు, ఉండ్రు శ్యాంబాబు, శీలం చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి సీతారాములు, తేలూరి వీరయ్య, తాత నిర్మల, పణితి శ్రీను, ఐ.వి. నాగేశ్వరరావు, వేముల రత్నాకర్, తోటకూర శ్రీకాంత్, ధర్మారావు, ప్రతిభా భారతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم