ప్రజాపక్షం / ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గ్రామానికి చెందిన యేసు శంకర్ బాబు నివాసంలో పిండి వంటలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కళాయికి నిప్పంటుకుని మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఇంటి లోపలికి వ్యాపించడంతో భయానక పరిస్థితి నెలకొంది.ఆ సమయంలో ఇంట్లో యేసు శంకర్ బాబు భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మంటలను వెంటనే గుర్తించిన వారు అప్రమత్తమై ఇంటి నుంచి బయటకు పరుగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.అగ్నిప్రమాదంలో ఇంట్లోని కొన్ని గృహోపకరణాలు అగ్నికి ఆహుతైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో మంటలు మరింత వ్యాపించకుండా నిలువరించగలిగారు.ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై స్థానికులు ఆరా తీస్తున్నారు. వంట చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు.

إرسال تعليق