ప్రజాపక్షం / మధిర : మధిర నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతాంగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి