ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 'ఉపాధ్యాయులు'...!


 

వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు, నిర్మాణ రంగంలో చురుకైన పాత్ర?

వీరికి అండగా నిలుస్తున్న ఆ అధికారి ఎవరు?

ఖమ్మం రూరల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యవహారశైలి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యాబోధన బాధ్యతలు నిర్వహించాల్సిన కొందరు ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్, వెంచర్ అభివృద్ధి, నిర్మాణ రంగాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానికంగా ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, కొందరు ఉపాధ్యాయులు పాఠశాల విధులకు భంగం కలిగేలా ప్రైవేట్ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో సెలవులు తీసుకుని భూముల కొనుగోలు–అమ్మకాలు, ప్లాట్ల విక్రయాలు, నిర్మాణ పనుల పర్యవేక్షణలో కనిపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. విద్యార్థులకు బోధన కంటే ప్రైవేట్ వ్యాపారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సేవా నియమావళి ప్రకారం కొన్ని వ్యాపార కార్యకలాపాలపై స్పష్టమైన పరిమితులు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. ఉపాధ్యాయ వృత్తి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే సంబంధిత అధికారులు వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు, ఆదాయ వనరులు, ఇతర కార్యకలాపాలపై పర్యవేక్షణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై సంబంధిత శాఖలు విచారణ చేపడతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో ఓ మండల స్థాయి అధికారి కొందరు ఉపాధ్యాయులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాలంటే సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم