ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రియల్ 'ఉపాధ్యాయుల' గుండెల్లో గుబులు..!

 


ప్రజాపక్షం కథనంతో ఉక్కిరిబిక్కిరి

నిఘా వర్గాల సైతం ఆరా?

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఉపాధ్యాయుల్లో ప్రజాపక్షం కథనం తీవ్ర కలకలం రేపినట్లు సమాచారం. కథనం వెలువడిన తర్వాత నిఘా వర్గాలు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.ఇటీవల వరకు వెంచర్లలో ప్లాట్ల విక్రయాలు, కొనుగోలుదారులతో మంతనాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో చురుకుగా కనిపించిన వారే ఇప్పుడు తమకు రియల్ వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు తెలిసింది. బంధువుల ప్లాట్లు, మిత్రుల నిర్మాణాలకే తమ పేర్లు వినిపించాయని, తాము కేవలం పరిచయాలు మాత్రమే కల్పించామని చెబుతుండటం గమనార్హం.అయితే ప్రజాపక్షం పరిశీలనలో ముదిగొండ మండలంలో పనిచేస్తూ ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన మరికొందరు ఉపాధ్యాయుల పేర్లు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. వీరు రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న కొందరు చిన్న స్థాయి ఏజెంట్లు స్వయంగా ప్రజాపక్షాన్ని సంప్రదించి, కథనంలో ప్రస్తావించిన అంశాలపై మరిన్ని వివరాలు సైతం అందిస్తున్న పరిస్థితి ఉంది . దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపడతారా? ప్రభుత్వ ఉద్యోగుల సేవా నియమావళి ఉల్లంఘన జరిగిందా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم