ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

చిన్నారుల విద్యకు అండగా ఏటుకూరి సుధాకర్ రావు



 రూ.50 వేలతో బల్లలు అందజేసి సేవా భావం చాటుకున్న వైనం

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: సమాజ సేవలో ముందుండే కాంగ్రెస్ నాయకుడు గ్రామ పెద్ద ఏటుకూరి సుధాకర్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మద్దులపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కూర్చోవడానికి సరిపడా బల్లలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన ఆయన తక్షణమే విద్యార్థుల సమస్య తెలుసుకుని తన సొంత నిధులతో రూ.50 వేల వ్యయంతో కొత్త బల్లలను కొనుగోలు చేయించి శనివారం పాఠశాలకు అందజేశారు. వీటిని గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో బల్లలను పాఠశాలకు బహుకరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇకపై సౌకర్యవంతంగా చదువుకునే అవకాశం కల్పించినందుకు ఏటుకూరి సుధాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందించిన సహాయం అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివృద్ధితో పాటు విద్యాభివృద్ధికీ తోడ్పడుతున్న సేవా కార్యక్రమాలు స్థానికంగా ప్రశంసలుఅందుకుంటున్నాయి. అలాగే పాఠశాల ఆధ్వర్యంలో శాలువాతో ఆయనను సత్కరించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుజాత 17వ వార్డు కౌన్సిలర్ గొడ్డు గొర్ల కృష్ణకుమారి  కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గురునారాయణ, గ్రామ నాయకులు అంజయ్య, సతీష్, రమేష్ పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم