ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

చిరునోములలో జోరుగా మట్టి అక్రమ తవ్వకాలు..!


 అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు.. టిప్పర్లతో మట్టి తరలింపు

పంట పొలాలు దెబ్బతింటున్నాయంటూ రైతుల ఆందోళన

మైనింగ్, రెవెన్యూ శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్

ప్రజాపక్షం / బోనకల్:  మండలంలోని చిరునోముల గ్రామ పరిసర ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అసైన్డ్ భూములతో పాటు వ్యవసాయ భూముల సమీపంలో భారీ యంత్రాలతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమ తవ్వకాలు మరింత పెచ్చరిల్లుతున్నాయని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.అక్రమ తవ్వకాల కారణంగా పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భూముల సహజ స్వరూపం మారిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ తవ్వకాల వల్ల నీటి నిల్వలు, సాగు భూములపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. పర్యావరణానికి కూడా నష్టం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు అక్రమ మట్టి రవాణా నిరంతరంగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని కూడా కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم