ప్రజాపక్షం/తిరుమలాయపాలెం : తిరుమలయపాలెం మండలం రాజారం గ్రామానికి చెందిన ప్రముఖ ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా నాగన్న చిత్రపటానికి నివాళులర్పించిన ఉపేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. నాగన్న ప్రజా గాయకుడిగా తన జీవితమంతా పీడిత, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. విప్లవ గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ చివరి శ్వాస వరకు ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచిన గొప్ప కళాకారుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.నాగన్న చేసిన సేవలు, ఆయన పాడిన ప్రజా గీతాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని నాగన్నకు నివాళులర్పించారు.

إرسال تعليق